ఉత్కంఠభరితంగా రాజమహల్
హారర్, సస్పెన్స్, రొమాంటిక్ అంశాలతో రాజమహల్ సినిమా వుత్కంతబరితంగా ఉంటుందని శుక్రవారం(ఈ రోజే ) విడుదల సందర్బంగా నిర్మాత ఈ విదంగా తెలియ చేసాడు . పూర్తి వివరాలు క్రింద చదవొచ్చుసూర్యనాథ్ నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘రాజమహల్’. సన్ ఐ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి అప్పాజీ కొండ దర్శకుడు. రియా, సందీప్తి నాయికలు. శుక్రవారం విడుదలవుతోందీ చిత్రం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కథానాయకుడు, నిర్మాత సూర్యనాధ్ మాట్లాడుతూ ‘‘దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో వెనుకాడకుండా నేనే నిర్మించాను. హారర్ నేపఽథ్యంలో రూపొందిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతోంది. శుక్రవారం సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని చెప్పారు. దర్శకుడు అప్పాజీ కొండ మాట్లాడుతూ ‘‘దర్శకుణ్ణి కావాలనే నాలుగేళ్ళ నా కల ఈ సినిమాతో నెరవేరుతోంది. హారర్, సస్పెన్స్, రొమాంటిక్ అంశాలతో తెరకెక్కిన చిత్రమిది. ఫోటోగ్రఫి, పాటలు సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. ‘‘కథానాయికగా చాలా సినిమాలు చేశాను. కానీ సరైన గుర్తింపు లభించలేదు. నా ప్రతిభను బయటపెట్టే చక్కని సినిమా ఇది’’ అని కథానాయిక సందీప్తి చెప్పారు. ఈ కార్యక్రమంలో మోహన్ వడ్లపట్ల, నరేంద్రనాఽథ్, సత్తిరెడ్డి, జయవాణి తదితరులు పాల్గొన్నారు. కాదంబరి కిరణ్, కృష్ణతేజ, సూర్య, జీవా, సౌమ్య, అక్షిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా జి.ఎల్.బాబు, సంగీతం సురేశ్ యువన్.