JR NTR,PURI movie 2nd schedule starts from 10th,sept.
ఎన్టీఆర్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న పేరుపెట్టని చిత్రం షూటింగ్ రెండో షెడ్యూల్ ఈ నెల 10 నుంచి జరగనుంది. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న బండ్ల గణేశ్ మాట్లాడుతూ ‘‘ఈ రెండో షెడ్యూల్‌తో సినిమా మొత్తాన్ని పూర్తి చేస్తాం. హైదరాబాద్, వైజాగ్‌తో పాటు విదేశాల్లోనూ చిత్రీకరణ జరుపుతాం. జనవరి 9న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తాం. ఇందులో ఎన్టీఆర్ ఓ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా డెఫినెట్‌గా మ్యూజికల్ హిట్టవుతుంది. ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కెరీర్‌లలోనూ, మా బేనర్‌లోనూ ఇది ప్రతిష్ఠాత్మక చిత్రంగా తయారవుతోంది’’ అని చెప్పారు. కాజల్ అగర్వాల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ, వెన్నెల కిశోర్, జయప్రకాశ్‌రెడ్డి, సప్తగిరి, కోవై పరళ, రమాప్రభ, పవిత్రా లోకేశ్ తారాగణం. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, ఛాయాగ్రహణం: శ్యామ్ కె. నాయుడు, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల.