loading...

Tuesday 2 September 2014

Sri Nilayam 2014 Telugu Movie Latest Trailers & Press Meet -‘శ్రీనిలయం’ టీజర్‌ - యోగేశ్‌, నేహా దేశ్‌పాండే -

0 comments

Sri Nilayam 2014 Telugu Movie Latest Trailers

                         యోగేశ్‌, నేహా దేశ్‌పాండే జంటగా ఎన్‌ ఈవెంట్స్‌ పతాకంపై హేమంత్‌ నల్లూరి నిర్మిస్తున్న ‘శ్రీనిలయం’. సురేశ్‌ దర్శకత్వం వహిస్తుండగా, ఆంజనేయులు కుంచాల సంగీతం సమకూరుస్తున్నారు. ఆదివారం సాయంత్రం ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా టైటిల్‌ లోగోను, టీజర్‌ను నిర్మాత అనిల్‌ సుంకర ఆవిష్కరించారు. ఈ చిత్రాన్ని 25 రోజుల్లో పూర్తి చేయడం ఆశ్చర్యాన్ని కలిగించిందనీ, ప్రోమో చూస్తుంటే చిన్న సినిమా అని అనిపించడం లేదనీ ఆయన అన్నారు. దర్శకుడు సురేశ్‌ మాట్లాడుతూ ‘‘ఇది సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకే అయిన కథ. రెండు గంటలసేపు ఉత్కంఠ కలిగించే చిత్రం’’ అన్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తయారైన ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుందని నిర్మాత హేమంత్‌ చెప్పారు. హీరో యోగేశ్‌ మాట్లాడుతూ ‘‘చక్కని కథతో ఈ సినిమా తయారైంది. ఇటీవలే వచ్చిన ఫస్ట్‌ కాపీ చూశాం. అందరికీ బాగా నచ్చింది. ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుంది’’ అన్నారు. జగన్‌, జోగినాయుడు, ప్రియాంక, హలీమ్‌ఖాన్‌, బేబి రమణి తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: సాయి అచ్చుత్‌ చిన్నారి, ఛాయాగ్రహణం: రవి.

Sri Nilayam 2014 Telugu Movie Latest Trailers



Sri Nilayam Movie Prees Meet

No comments:

Post a Comment