loading...

Tuesday 2 September 2014

Sampurnesh Babu New Movie News - సంపూర్ణేష్‌బాబు ‘వైరస్‌ డాట్‌ కామ్‌’

0 comments

        

  Sampurnesh Babu New Movie News

 - సంపూర్ణేష్‌బాబు ‘వైరస్‌ డాట్‌ కామ్‌’ 

                            సంపూర్ణేష్‌బాబు కథానాయకుడిగా ‘www..వైరస్‌.com అనే చిత్రం రూపొందబోతోంది. ‘బివేర్‌’ అనేది ఉప శీర్షిక. ఎ.ఎస్‌.ఎన్‌. ఫిలిమ్స్‌ పతాకంపై సలీం, ఎ.జె. రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిహెచ్‌. శివరామకృష్ణ దర్శకుడు. ‘‘మా హీరో సంపూర్ణేష్‌బాబును ఇందులో సరికొత్త కోణంలో చూపిస్తున్నాం. ఆయన నుంచి ఎలాంటి వినోదాన్ని ప్రేక్షకులు కోరుకుంటారో, ఈ చిత్రంలో అది పూర్తిగా అందుతుంది’’ అని దర్శకుడు చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘మాస్‌, క్లాస్‌ తేడా లేకుండా అన్ని వర్గాల, తరగతుల ప్రేక్షకులకు నచ్చే, అందరూ సకుటుంబంగా వచ్చి ఆనందించే కథను దర్శకుడు చెప్పారు. నేటి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తూనే యువతరాన్ని ఉత్తేజపరుస్తూ, ఆద్యంతం ఆసక్తిపరిచే కథాంశంతో, ఒక వినూత్న కథనంతో ఈ చిత్రం ఉంటుంది. విజయదశమికి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. అక్టోబర్‌, నవంబార్‌ మాసాల్లో చిత్రీకరణ జరిపి, డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఇందులో ‘హృదయ కాలేయం’కు భిన్నమైన పాత్ర చేస్తున్నాననీ, ఈ చిత్రంతో తనకు సరికొత్త ఇమేజ్‌ వస్తుందనీ సంపూర్ణేష్‌బాబు చెప్పారు. ఈ చిత్రానికి కథా విస్తరణ, మాటలు: దుర్గాప్రసాద్‌ నాయుడు, ఛాయాగ్రహణం: వీజే, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: సిహెచ్‌. శివరామకృష్ణ.

Source : Andhrajyothy News Paper

No comments:

Post a Comment