loading...

Tuesday 2 September 2014

"Blade Batch" Telugu New Movie News - Phani,Murthi,Divya,Vennela

0 comments
                    

 "Blade Batch"  Telugu New Movie News  - Phani,Murthi,Divya,Vennela





 


                                 శ్రీ స్వర్ణ వరల్డ్‌ మూవీస్‌ పతాకంపై డా. పి.ఎం. సుందరరావు దర్శకత్వంలో బి. మూర్తి నిర్మిస్తున్న చిత్రం ‘బ్లేడ్‌ బ్యాచ్‌’. ఫణి, మూర్తి హీరోలుగా, దివ్య, వెన్నెల హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాకీ పార్ట్‌ పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సంగతిని నిర్మాత మూర్తి తెలియజేస్తూ ‘‘నేటి సమాజంలో చెలరేగుతున్న అరాచక శక్తులపై ఇద్దరు యువకులు సాగించిన పోరాటం ఇందులోని ప్రధానాంశం. అన్ని వర్గాలవారినీ అలరించే అంశాలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. సంగీతం చిత్రానికి ఓ ప్రత్యేకాకర్షణ అవుతుంది. ఇంకా నాలుగు పాటలు చిత్రీకరించాల్సి ఉంది. సెప్టెంబర్‌లో పాటలనూ, అక్టోబర్‌లో చిత్రాన్నీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. జెన్నీ, పొట్టి రాంబాబు, పలాస శ్రీను, గబ్బర్‌సింగ్‌ బ్యాచ్‌, సోని తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: సదివే దేవేంద్ర, ఛాయాగ్రహణం: దారా రవి.

Source : Andhrajyothy News Paper

No comments:

Post a Comment