‘ఈగ’ ఫేమ్ సుదీప్, ‘మర్యాదరామన్న’ ఫేమ్ సలోని జంటగా నటించిన చిత్రం ‘రౌడీ సింహా’. కన్నడంలో ఘన విజయం సాధించిన ‘మిస్టర్ తీర్థ’ చిత్రానికి ఇది తెలుగు అనువాద రూపం. సూర్యక్షేత్ర మీడియా పతాకంపై పొత్తూరి నాగేంద్రప్రసాద్ వర్మ, కె. సుబ్రహ్మణ్యం, ప్రసాద్ అందిస్తున్నారు. వారు మాట్లాడుతూ ‘‘తెలుగు ప్రేక్షకులకు నచ్చే పలు అంశాలు ఉండటంతో దీన్ని తెలుగులో అందిస్తున్నాం. కన్నడంలో మాదిరిగానే తెలుగులోనూ ఇది పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం. గురుకిరణ్ సంగీతం సమకూర్చిన ఐదు పాటలూ అలరిస్తాయి. ఫారిన్‌లో తీసిన పాటలు ప్రత్యేకాకర్షణ అవుతాయి. ఇందులో మాస్ ప్రేక్షకులను అలరించే ఐదు ఫైట్లున్నాయి. ఈ నెల్లోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. అనంతనాగ్, గీత, అవినాష్, సాధుకోకిల తారాగణమైన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: దాసరి శ్రీనివాసరావు, సహ నిర్మాతలు: ఆకురాతి రామకృష్ణ, జి. కోటేశ్వరరావు, సమర్పణ: కె. నోమినతార, దర్శకత్వం: సాధుకోకిల.
Souce : Andhrajyothy news paper