loading...

Wednesday 3 September 2014

‘చంద్రముఖి’ తరహాలో ‘చంద్రిక’ -'CHANDRIKA' Telugu Movie News - Kamna Jethmalani

0 comments
          
           
                   కామ్నా జెఠ్మలానీ, శ్రీముఖి (‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’ ఫేమ్‌) ప్రధాన పాత్రధారులుగా తెలుగు, కన్నడ భాషల్లో ఏక కాలంలో రూపొందుతున్న చిత్రం ‘చంద్రిక’. హీరోగా అర్జున్‌, డైరెక్టర్‌గా యోగేశ్‌ మునిసిద్ధప్ప పరిచయమవుతున్నారు. ఫ్లయింగ్‌ వీల్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న వి. ఆశ మాట్లాడుతూ ‘‘సంచలన విజయం సాధించిన ‘చంద్రముఖి’ తరహాలో హారర్‌ మేళవించిన ఫ్యామిలీ డ్రామా ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తయారవుతోంది. ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని గడుపుతున్న ఓ కొత్తజంట నివసించే భవనంలో జరిగే అనూహ్య సంఘటనల సమాహారం ఈ చిత్రం. ఇటీవలే మొదటి షెడ్యూల్‌ పూర్తయింది. హైదరాబాద్‌, బెంగళూరులో చిత్రీకరణ జరుపుతున్నాం. త్వరలో రెండో షెడ్యూల్‌ ప్రారంభిస్తాం. ఇప్పటికే తమిళ, కన్నడ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం పొందిన కామ్న ఈ చిత్రంతో వారికి మరింత దగ్గరవుతుంది. ఆమె కెరీర్‌లో ఇది ఓ మైలురాయిలా నిలుస్తుంది. అర్జున్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తాడు. శ్రీముఖి అభినయం ప్రత్యేక ఆకర్షణ అవుతుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: గున్వంత్‌, కూర్పు: వి. సురేశ్‌కుమార్‌, యాక్షన్‌: డ్రాగన్‌ ప్రకాశ్‌, కళ: నాగు, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: యోగేశ్‌ మునిసిద్ధప్ప.

No comments:

Post a Comment