loading...

Wednesday 3 September 2014

'O Manasa Evari Kosam' movie News - O Manasa Evari Kosam Movie Launch

0 comments

O Manasa Evari Kosam movie News

produced :R. Uday Kumar. 
Directed : Ashok Raja, 
Music : Gantadi Krishna
CAST : Yuva Kishore,Anil Mogili,Shruti Hussain
యువకిశోర్‌, అనిల్‌ మొగిలి, శ్రుతి హీరోహీరోయిన్లుగా యూకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ‘ఓ మనసా ఎవరి కోసం?’ చిత్రం తాజా షెడ్యూల్‌ ఈ నెల ఏడు నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతుంది. అశోక్‌రాజా దర్శకత్వంలో ఆర్‌.ఉదయకుమార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘తొలి షెడ్యూల్‌లో కీలకసన్నివేశాలను చిత్రీకరించాం. ఫిల్మ్‌సిటీలో జరిగే రెండో షెడ్యూల్‌తో పాటలు మినహా చిత్రం పూర్తవుతుంది. సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఆయన గతంలో స్వరపరిచిన ‘6టీన్స్‌’, ‘సంపంగి’ చిత్రాల స్థాయిలో ఈ పాటలు ఉన్నాయి. మా దర్శకుడు అశోక్‌రాజ్‌ ఆసక్తికరంగా సినిమాను తీస్తున్నారు. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాలవారికీ నచ్చుతుంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి పాటలు: వేల్పుల వెంకటేశ్‌, ఫొటోగ్రఫీ: వెంకట్‌రాజు, సమర్పణ: శివసాయి, కథ, మాటలు, దర్శకత్వం: అశోక్‌రాజా.

No comments:

Post a Comment