సన్‌రైజ్ మూవీమేకర్స్ పతాకంపై వై.జి.యస్. రాజు, డి. భానుమూర్తి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘హాయ్ గయ్స్.. హల్లో సర్’. కోట మునీశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నీరజ్ చౌహాన్, వస్కా రాము, అంజలి, దివ్య, అజిత్ ప్రధాన పాత్రధారులు. భానుచందర్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. 50 శాతం టాకీ పూర్తయిన సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో దర్శకుడు మునీశ్ మాట్లాడుతూ ‘‘కాలేజీలో ర్యాగింగ్ వల్ల యువత ఏం కోల్పోతున్నారనే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. సెప్టెంబర్‌లో తదుపరి షెడ్యూల్ జరుపుతాం. ఆరు పాటలను బ్యాంకాక్‌లో చిత్రీకరిస్తాం’’ అని చెప్పారు. విద్యాసంస్థలు నడుపుతున్న తను విద్యా వ్యవస్థ మీద దర్శకుడు చెప్పిన కాన్సెప్ట్ నచ్చి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నానని భానుమూర్తి తెలిపారు. యువతకే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఈ చిత్రం ఆకట్టుకుటుందన్నారు. సమాజంలో యువత ఎలా ఉండాలనే కాన్సెప్టుతో తయారవుతన్న ఈ చిత్రంతో తమకు మంచి పేరు వస్తుందనే నమ్మకాన్ని హీరో హీరోయిన్లు వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్, ఛాయాగ్రహణం: కుమారస్వామి, కూర్పు: మార్తాండ్ కె. వెంకటేశ్.
Source : Andhrajyothy news paper