అజిత్, మీరాజాస్మిన్ జంటగా నటించిన ఓ తమిళ చిత్రాన్ని రాఘవేంద్ర ఫిల్మ్స్ సంస్థ ‘నే.. వస్తున్నా’ పేరుతో తెలుగులోకి అనువదిస్తోంది. ప్రస్తుతం మణిశర్మ సంగీత దర్శకత్వంలో పాటల రికార్డింగ్, రీరికార్డింగ్ జరుగుతోందని నిర్మాత ఎస్. మురళీరామనాథం చెప్పారు. ‘యాక్షన్‌ఎంటర్‌టైనర్ చిత్రమిది.
ఇందులో మొత్తం పదకొండు ఫైట్స్ ఉన్నాయి. ఒక్కో ఫైట్ ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేస్తుంది. రిస్కీ ఫైట్స్ కి అజిత్ డూప్ లేకుండా చేయడం విశేషం. అజిత్ పవర్ ఫుల్ యాక్షన్, మీరా జాస్మిన్ అందం, అభినయం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. అలాగే మణిశర్మ స్వరపరచిన ఆరు పాటలూ అద్భుతంగా ఉంటాయి. ఇది మంచి యాక్షన్ ఎంటర్ టైనర్. అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది” అని చెప్పారు. అజిత్, మీరా జాస్మిన్, కోవై సరళ, మణివన్నన్, జయప్రకాష్ రెడ్డి, పొన్నాంబళం, మన్సూర్ అలీఖాన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, మాటలు: శ్రీరామ్ .వై, సహనిర్మాత: పరిటాల రాంబాబు, నిర్మాత: మురళీ రామనాధన్