తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఇంటర్వెల్ లేకుండా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు పార్థసారథి, గజేంద్రనాయుడు, విజయ్ చెప్పారు.
దీనికి గల కారణాన్ని వివరిస్తూ ‘‘మా సినిమా థ్రిల్లర్ జోనర్‌కి సంబంధించింది. హాలీవుడ్, యూరోపియ న్, ఏషియన్‌కి సంబంధించిన థ్రిల్లర్ జోనర్ సినిమాల్ని సాఽధారణంగా 85 నుంచి 90 నిమిషాల నిడివితో ఇంటర్వెల్ లేకుండా రిలీజ్ చేస్తుంటారు. ‘అనుక్షణం’ కూడా అదే కోవకి చెందిన సినిమా కనుక ఈ నిర్ణయం తీసుకొన్నాం.
మంచు విష్ణు హీరోగా ఏవీ పిక్చర్స్ సంస్థ రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో నిర్మించిన ‘అనుక్షణం’ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. చిత్రంలోని ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది. అలాగే మా సినిమా కోసం నిర్వహించిన వేలంపాట కార్యక్రమం సక్సెస్ కావడంతో ఈ నెల 6న ఆక్షన్‌లో బిడ్ గెలిచినవాళ్లందరినీ హైదరాబాద్‌కు ఆహ్వానించి నోవాటెల్‌లో వాళ్ల సమక్షంలో మీడియాకి ‘అనుక్షణం’ సెకండ్ ట్రైలర్ చూపించబోతున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రంలో తేజస్వి, మధుశాలిని, రేవతి, బ్రహ్మానందం, నవదీప్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.