Starring Sivaji, Kainaz Motiwala, Brahmanandam, Posani Krishna Murali, Vennela Kishore, Srinivasa Reddy, Chitram Seenu, Thagubothu Ramesh , Actor Dhanraj, Venu, Chandra and Ravi Varma, Directed by Rewon Yadu. Produced by Annamreddy Ramesh, Prasad Reddy, Music composed by Sekhar Chandra. Editor Prawin Pudi, Lyrics by Sreemani.
‘‘ఎక్కడా మెహర్బానీలకు పోకుండా ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి స్ర్కీన్‌మీద కనిపించేట్లు ఈ సినిమా తయారైంది. ఇది ఆడితే ఇండసీ్ట్రకి మేలు’’ అని చెప్పారు శివాజీ. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బూచమ్మ బూచోడు’. స్నేహ మీడియా, హెజన్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై రమేశ్ అన్నంరెడ్డి, ప్రసాద్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రేవన్ యాదూ దర్శకుడు. ఈ నెల 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా శివాజీ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. నేను మళ్లీ కామెడీ చేద్దామని చేసిన సినిమా ‘బూచమ్మ బూచోడు’. ఎక్కడా వృథా కాకూడదని ఎంత ప్రయత్నించినా, ఓ శాఖలో రూ. పది లక్షలు వృథా అయ్యాయి. ఇది నిజం. లేకపోతే ఇంకా తక్కువ ఖర్చుకే సినిమా పూర్తయ్యేది. కొత్త కథతో, కొత్తగా చెప్పాం. ఇది అద్భుతమైన స్ర్కీన్‌ప్లేతో తయారైన కామెడీ హారర్ ఫిల్మ్. ఇలాంటి సినిమా ఇప్పటివరకూ తెలుగులో రాలేదు.
‘భలే తీశారే’ అంటున్నారు
ఫస్టాఫ్‌లో భయం, కామెడీ రెండూ ఉంటాయి. సెకండాఫ్ అంతా నవ్వుతూనే ఉంటారు. నేటి సమాజంలో భార్యాభర్తలు ఎదుర్కొంటున్న ఓ సమస్య ఇందులోని ప్రధానాంశం. ఆఖర్లో ఆవేశం మంచిది కాదనే సందే శం ఉంటుంది. బాలీవుడ్‌లో పెద్ద హిట్టయిన ‘రాగిణి ఎంఎంఎస్’ ఫేమ్ కైనాజ్ మోతీవాలా ఇందులో హీరోయిన్‌గా చేసింది. ఇప్పటివరకూ ఈ సినిమాని చూసినవాళ్లంతా ‘భలే తీశారే’ అన్నవాళ్లే. నిజానికి ఈ సినిమా ఏప్రిల్‌లోనే రిలీజ్ కావాల్సి ఉంది. గ్రాఫిక్స్ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. చాలా తక్కువ ఖర్చుతోటే ఈ సినిమాకు 3డి గ్రాఫిక్స్ చేసిచ్చారు.
గుర్తుండిపోయే సినిమా
ప్రవీణ్ పూడి, విజయ్ మిశ్రా, శేఖర్ చంద్ర, శ్రీమణి వంటి ప్రతిభావంతులైన టెక్నీషియన్లు పనిచేశారు. రోజుకు రూ. 15 వేల రెంట్ విలువ కలిగిన లెన్స్‌లు ఉపయోగించాం. ఇది ఖచ్చితంగా హిట్ సినిమా. నా కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా. 150 థియేటర్లలో విడుదలవుతోంది.
తప్పని అనుకోవట్లేదు
ప్రస్తుతం ఓవర్‌నైట్ బిజినెస్ వల్ల ఎవరికి లాభముంటున్నదో అర్థం కావట్లేదు. నిర్మాత నష్టపోతున్నాడు. హీరో పేరు చెడిపోతోంది. నిర్మాత గురించి పట్టించుకునేవారు ఎవరూ ఉండట్లేదు. నిర్మాత గురించి ఆలోచించడం వల్లే ఇవాళ నేను ఈ స్థితికి చేరుకున్నా. అయినా నేను హ్యాపీగానే ఉన్నా. నేను చేసింది తప్పని అనుకోవట్లేదు. ఇవాళ నిర్మాత మహారాజ పోషకుడైపోయాడు. సినిమా తీశాక రోడ్డు మీద నిలబడుతున్నాడు. సినిమా తీసి రాత్రిపూట నిద్రపట్టని నిర్మాతలు ఎంతోమంది ఉంటున్నారు. ఇవాళ సినిమా మీద పెడుతున్న ఖర్చులో నిజానికి 70 శాతం వృథా ఖర్చే. రూ. 50 కోట్లతో తీస్తున్న సినిమాలు ఎలా ఉంటున్నాయో చూస్తూనే ఉన్నాం. ఈ ఏడాది బాగా ఆడింది ఎక్కువగా చిన్న సినిమాలే. రూ. 50 కోట్లతో ఓ సినిమా తీసే బదులు ఆ డబ్బుతో 50 సినిమాలు తీయొచ్చని నిర్మాతలు ఆలోచించడం లేదు. కాంబినేషన్లను కాకుండా కథను నమ్ముకొని సినిమా తీసే రోజులు రావాలి.