‘డార్లింగె ఓసి నా డార్లింగే’ చిత్రం షూటింగ్ విశేషాలు - దిలీప్‌రాజ్,మేఘశ్రీ
నాగార్జున సినీ క్రియేషన్స్, వి.ఆర్. ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘డార్లింగె ఓసి నా డార్లింగే’ చిత్రం షూటింగ్ పూర్తయింది. బెంగళూరు, మడికేర్, కడప, హైదరాబాద్ లొకేషన్లలో షూటింగ్ జరిగింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు డి.వెంకటరమణ, శ్రీరంగం సతీశ్‌కుమార్ మాట్లాడుతూ ‘ఈ చిత్రంతో దిలీప్‌రాజ్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాం. మేఘశ్రీ హీరోయిన్. లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా చిత్రం రూపుదిద్దుకుంటోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలతో తయారవుతున్న ఈ చిత్రం మా సంస్థకు మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు. బంటి, సింధు, భాను, విజయ్‌త్రిష, శ్రీమాన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: నరేశ్‌ప్రసాద్, సంగీతం: సుబాష్, ఎడిటింగ్: ప్రకాశ్, దర్శకత్వం: వెంకట్ డి.