హిట్ టాక్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ‘కిరాక్’ చిత్రం ఈ నెల 5న విడుదలవుతోంది. హారిక్ దేవభక్తుని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనిరుద్ధ్, చాందిని హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘కన్నకూతురు తప్పిపోతే తల్లి పడే ఆవేదన, పవన్‌కల్యాణ్ అభిమాని, మహేశ్ అభిమాని అయిన ఓ యువతిని ప్రేమించాలనే ఆలోచన, 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన పాప ఎక్కడుందో కనుక్కోవడానికి హీరో చేసే ప్రయత్నం... ఈ మూడు అంశాల కలయికే మా ‘కిరాక్’ చిత్రం. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంది’ అని తెలిపారు. నిర్మాతల్లో ఒకరైన డి.గోపీకృష్ణ మాట్లాడుతూ ‘సినిమా పట్ల మా టీమంతా చాలా పాజిటివ్‌గా ఉన్నాం. అన్ని ఏరియాల్లో బిజినెస్ బాగా జరిగింది. ఓవర్సీస్‌లో కూడా సినిమాను విడుదల చేస్తాం’ అని తెలిపారు. కాశీవిశ్వనాథ్, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: డాక్టర్ ఆర్., ఫొటోగ్రఫీ: బి.దుర్గాకిశోర్, సంగీతం: అజయ్ అరసాద, ఎడిటింగ్: నందమూరి హరి, నిర్మాతలు: డి.గోపీకృష్ణ, గంగపట్నం శ్రీధర్.
ఇంతకముందే అనిరుద్ చాలా షార్ట్ ఫిల్మ్స్ లో ఆక్ట్ చేసాడు మరియు పవన్ కళ్యాణ్ ను బాగా ఇమిటేట్ చేసి మంచి పేరు సంపాదించాడు కూడా .....