loading...

Saturday 6 September 2014

అవకాశమివ్వడమే కాకుండా నిర్మాతను కూడా శ్రీహరిగారే చూశారు

0 comments
             

     అవకాశమివ్వడమే కాకుండా నిర్మాతను కూడా శ్రీహరిగారే చూశారు

     దృష్టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఆదిత్‌, సుప్రియా శైలజా జంటగా తోట మధు నిర్మించిన చిత్రం ‘వీకెండ్‌ లవ్‌’. సినీ పాత్రికేయుడు నాగు గవర దర్శకుడిగా పరిచయమయ్యారు. స్వర్గీయ శ్రీహరి కీలక పాత్ర పోషించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగు గవర మాట్లాడుతూ... ‘‘నేనే కథనైతో నమ్మానో దాన్నే ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాను. సినిమాపై నమ్మకం ఉన్నప్పటికీ విడుదల దగ్గరకొచ్చేసరికి ఏదో భయం వెంటాడింది. అయితే ప్రేక్షకుల నుండి చక్కని స్పందన వస్తోంది. మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఏడాదిన్నర కష్టానికి చక్కని ప్రతిఫలం దక్కింది. ఆదివారం నుండి థియేటర్లు పెంచే అవకాశం ఉంది’’. నాగు చెప్పిన మరికొన్ని వివరాలు ఆయన మాటల్లోనే..
శ్రీహరితో అనుబంధం 
చిత్ర పర్రిశమలో అడుగుపెట్టినప్పటి నుండి శ్రీహరిగారితో మంచి అనుబంధం ఉంది. సొంత తమ్ముడిలా చూసేవారు. నేను దర్శకుణ్ణి కావడానికి ఆయనే ముఖ్య కారణం. ఆయనకు మూడు ముక్కల్లో కథ చెప్తే చాలా ఇష్టం. అలాగే చెప్పడంతో ఆయనకి కథ బాగా కనెక్ట్‌ అయింది. పైగా టైటిల్‌ ఆయనకు బాగా నచ్చడంతో ప్రొసీడ్‌ అయ్యాం. దర్శకుడిగా అవకాశమివ్వడమే కాకుండా తోట మధులాంటి మంచి నిర్మాతను నాకు ఇచ్చారు. సినిమా గ్రాండ్‌గా రావడానికి నిర్మాతే ముఖ్యకారణం. కథ, సంగీతం, మాటలు, శ్రీహరిగారి పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. క్లైమాక్స్‌ డైలాగ్‌లు ప్రతి ఒక్కరి చేత కన్నీరు పెటి ్టంచాయి. 
కష్టాల్లో ఆదుకున్న వ్యక్తి 
నా కెరీర్‌ బిగినింగ్‌ నుండి బి.ఏ.రాజుగారు నాకు అండగా ఉన్నారు. ఇబ్బందుల్లో ఆర్థికంగా ఆదుకున్నారు. శ్రీహరిగారు ఈ సినిమా అంగీకరించగానే ముందు రాజుగారికే చెప్పాను. సినిమా ప్రారంభం నుండి ఈరోజు వరకు నాకు సహకరిస్తున్నారు.  మరో రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి ‘వీకెండ్‌ లవ్‌’ మంచి ఫలితాన్నిచ్చింది. ఆల్‌రెడీ నా దగ్గర రెండు కథలు రెడీగా ఉన్నాయి. అందులో ఒకటి కామెడీ ఎంటర్‌టైనర్‌, మరొకటి పెద్ద హీరోతో చేయాల్సిన కమర్షియల్‌ సినిమా. త్వరలోనే ఆ విషయాలు తెలియజేస్తా.


Source : Andhra jyothy news

No comments:

Post a Comment