loading...

Saturday 6 September 2014

లాయర్‌ పాత్రలో ఐశ్వర్య

0 comments
                              

లాయర్‌ పాత్రలో ఐశ్వర్య  

ఐశ్వర్యారాయ్‌ కమ్‌బ్యాక్‌ సినిమాగా వార్తల్లో నిలిచిన ‘జజ్‌బా’ కథ ఒరిజినల్‌ కాదనీ, దానికి ఓ కొరియన్‌ సినిమా కథ ఆధారమనీ తెలుస్తోంది. దర్శకుడు సంజయ్‌ గుప్తా ఆ విషయాన్ని ఎంత దాచాలని ప్రయత్నించినా ఆ విషయం బయటకు వచ్చేసింది. దాంతో ‘జజ్‌బా’కు ఆధారమైన దక్షిణ కొరియా చిత్రం ‘సెవన్‌ డేస్‌’ రీమేక్‌ రైట్స్‌ను కొనేందుకు ప్లాన్‌ చేస్తున్నామని ఓ వార్తాపత్రికకు తెలిపాడు సంజయ్‌. ఈ చిత్రంలో లాయర్‌గా ఐశ్వర్య, పోలీస్‌గా ఇర్ఫాన్‌ఖాన్‌ నటించనుండగా, ఐశ్వర్య క్లయింట్‌గా జాన్‌ అబ్రహాం కనిపించనున్నాడని సమాచారం. ఫారిన్‌ ఫిలిమ్స్‌ ఆధారంగా సినిమాలు తీయడం సంజయ్‌కు కొత్తేమీ కాదు. ఆయన మునుపటి సినిమాలు ‘కాంటే’, ‘ప్లాన్‌’, ‘ముసాఫిర్‌’, ‘జిందా’ వంటివి హాలీవుడ్‌ సినిమాకో, కొరియన్‌ సినిమాకో రీమేక్‌లు కావడం గమనార్హం.

Source : andhra jyothy news

No comments:

Post a Comment