loading...

Friday 5 September 2014

‘నషా’ తర్వాత.. పూనం పాండే

0 comments

 ‘నషా’ తర్వాత.. పూనం పాండే 

                 గత ఏడాది ‘నషా’ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన సంచలన తార పూనమ్‌ పాండే, దాని తర్వాత ఏ సినిమా చేస్తుందా.. అని చాలామంది ఎదురుచూస్తున్నారు. కొంత విరామంతో రెండో సినిమాకు సంతకం చేసింది పూనమ్‌. ద వరల్డ్‌ నెట్‌వర్క్స్‌ అనే సంస్థ తొలి ప్రయత్నంగా ఆమెతో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘నషా’ తర్వాత ఎన్ని స్ర్కిప్టులను తను తిరస్కరించిందో చెప్పలేనని తెలిపిందామె. ‘‘ఇది అతిగా అనిపించవచ్చు. అయితే ఈ ఆఫర్‌తో నిర్మాతలు నా వద్దకు వచ్చినప్పుడు, నా రెండో సినిమాగా ఇది సరిగ్గా సరిపోతుందని తోచింది. సరైన మార్కెటింగ్‌ లేకపోవడం వల్లే ‘నషా’ ఆడలేదు. నా రెండో సినిమా నిర్మాతలు పబ్లిసిటీ బాగా చేస్తారనే నమ్మకం ఉంది. ఈ సినిమా నా అభిమానులను నిరాశపరచదు. అంటే నేను కేవలం స్కిన్‌ షోకి మాత్రమే పరిమితమవుతానని అనుకోకండి. ఇది మంచి సెన్సిటివ్‌ సబ్జెక్ట్‌ కూడా’’ అని వివరించింది పూనమ్‌.




 Source : Andhrajyothy news paper

No comments:

Post a Comment