loading...

Tuesday 2 September 2014

"A SyamGopal Varma Film" Telugu Movie Trailer - ‘ఎ శ్యామ్‌గోపాల్‌ వర్మ ఫిల్మ్‌’ ప్రచార చిత్రం

0 comments

  "A SyamGopal Varma Film" Telugu Movie Trailer -  ‘ఎ శ్యామ్‌గోపాల్‌ వర్మ ఫిల్మ్‌’  ప్రచార చిత్రం


                            షఫీ ప్రధాన పాత్రధారిగా సమిష్టి క్రియేషన్స్‌ పతాకంపై వి. విజయకుమార్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘ఎ శ్యామ్‌గోపాల్‌ వర్మ ఫిల్మ్‌’. రాకేశ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘మంత్ర’ ఆనంద్‌ సంగీతదర్శకుడు. సోమవారం ప్రసాద్‌ ల్యాబ్స్‌ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను షఫీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఇమాజినేషన్‌ను, ఫిక్షన్‌ను, రియాల్టీనీ కలిపి రియలిస్టిక్‌ పంథాలో ప్రెజెంట్‌ చేయడమంటే నాకు చాలా ఇష్టం. దాన్ని నాణ్యతతో చూపించగలిగితే సినిమా ఆకట్టుకుంటుందని నమ్ముతాను. ఇది సరిగ్గా అలాంటి సినిమా’’ అని చెప్పారు. రక్తపాత సినిమాలు తీసే ఓ డైరెక్టర్‌ అందుకుగాను ఎలాంటి ఫలితాన్ని అనుభవించాడనేది ఈ చిత్ర కథాంశమని దర్శకుడు రాకేశ్‌ శ్రీనివాస్‌ తెలిపారు. శ్యాంగోపాల్‌వర్మగా షఫీ ఉన్నతస్థాయి నటనను ప్రదర్శించారన్నారు. నిర్మాత విజయకుమార్‌ రాజు మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. మరో వారంలో తొలికాపీ వస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం ప్రాధాన్యం ఉందనీ, సన్నివేశానుగుణమైన సంగీతాన్ని అందించాననీ ఆనంద్‌ చెప్పారు. జోయాఖాన్‌ నాయికగా నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రాహుల్‌ శ్రీవాత్సవ్‌, కూర్పు: కార్తీక శ్రీనివాస్‌, ఫైట్స్‌: రవి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కె. రంగరాజు, సహ నిర్మాతలు: రేఖారెడ్డి, పి.వి. సత్యనారాయణరాజు, పి. సూర్యనారాయణరాజు, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: రాకేశ్‌ శ్రీనివాస్‌.

A Shyam Gopal Varma Film Trailer-Latest Telugu Movie Trailer

No comments:

Post a Comment