loading...

Friday 5 September 2014

బికినీకి సిద్ధమే.. కానీ...(Andgrajyothy news paper)

0 comments

 బికినీకి సిద్ధమే.. కానీ...

                   బాలీవుడ్‌ నాయికలంటే బికిని ధరించడానికి సిద్ధపడాల్సిందే. అందుకు కొందరు నాయికలు సమయం తీసుకుంటారు. ఇంకొందరు పరిశ్రమలో అడుగుపెట్టగానే సై అంటారు. ఇప్పటి వరకు లిప్‌లాక్‌ సన్నివేశాల్లో మాత్రమే కనిపించిన పరిణీతి చోప్రా బికినీలో ఏ సినిమాలోను కనిపించలేదు. ఇకపై గర్ల్‌ నెక్ట్‌ డోర్‌లాంటి క్యారెక్టర్లు మాత్రమే కాకుండా, గ్లామర్‌ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమంటోంది. అయితే అందుకు ఇంకా సమయం ఉందని, తన శరీరాకృతి ఇంకా మెరుగవ్వాలని, పాత్ర కూడా అందుకు డిమాండ్‌ చేయాలని అంటోంది 25 ఏళ్ళ ఈ చిన్నది. తాజాగా ఆమె నటిస్తోన్న చిత్రం ‘దావత్‌ ఏ ఇష్క్‌’. ఆదిత్యారాయ్‌ కపూర్‌ కథానాయకుడు. ఆహారం, ప్రేమ నేపథ్యంలో యశ్‌రాజ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హబీబ్‌ ఫైసల్‌ దర్శకుడు. ఈ నెల 19న విడుదలకు సిద్దమవుతోంది. ఇందులో తన పాత్ర వైవిధ్యంగా ఉంటుందనీ, హబీబ్‌ పైసల్‌ దర్శకత్వంలో రెండోసారి పనిచేయడం ఆనందంగా ఉందనీ చెప్పుకొస్తుంది పరిణీతి.

No comments:

Post a Comment