loading...

Friday 5 September 2014

గిన్నిస్‌ బుక్‌లో హాలీవుడ్‌ హీరోయిన్‌ -జెన్నిఫర్‌ లారెన్స్‌.

0 comments

గిన్నిస్‌ బుక్‌లో హాలీవుడ్‌ హీరోయిన్‌  

ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన సినీ నాయికగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించినదెవరో తెలుసా? హాలీవుడ్‌ అందాల భామ జెన్నిఫర్‌ లారెన్స్‌. బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్టయిన ‘హంగర్‌ గేమ్స్‌’ సీరిస్‌లో కట్నిస్‌ ఎవర్డీన్‌ పాత్రతో ఆమె ఈ ఘనతను సాధించింది. ‘హంగర్‌ గేమ్స్‌’, దాని సీక్వెల్‌ ‘క్యాచింగ్‌ ఫైర్‌’ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద 900 మిలియన్‌ పౌండ్లను వసూలుచేసి రికార్డును నెలకొల్పాయి. ఈ సీరిస్‌లోని మరో రెండు సినిమాల్లోనూ లారెన్స్‌ నటిస్తోంది. వాటిలో మొదటిది ‘మాకింగ్‌జే - పార్ట్‌ 1’ ఈ ఏడాది నవంబర్‌లోనూ, ‘మాకింగ్‌జే - పార్ట్‌ 2’ వచ్చే ఏడాది నవంబర్‌లోనూ రానున్నాయి. 2010లో వచ్చిన ‘వింటర్స్‌ బోన్‌’ సినిమాలో నాయికగా మొదటిసారి దర్శనమిచ్చిన లారెన్స్‌ నాలుగేళ్ల కాలంలోనే అత్యధిక హిట్‌ చిత్రాల్లో నటించిన తారగా రికార్డులకెక్కడం విశేషం. ఆమె నాయికగా చేసిన ఇతర చిత్రాల్లో ‘ఎక్స్‌-మెన్‌: ఫస్ట్‌ క్లాస్‌’, దాని సీక్వెల్‌ ‘ఎక్స్‌-మెన్‌: డేస్‌ ఆఫ్‌ ఫ్యూచర్‌ పాస్ట్‌’, ‘అమెరికన్‌ హజిల్‌’ ఉన్నాయి. డేవిడ్‌ ఓ రస్సెల్‌ రూపొందించగా 2013లో వచ్చిన ‘సిల్వర్‌ లైనింగ్స్‌ ప్లేబుక్‌’లో నటనకు గాను ఉత్తమ నటిగా ఆస్కార్‌ అవార్డును సైతం సొంతం చేసుకుంది లారెన్స్‌.

No comments:

Post a Comment