‘అల్లరి’ నరేశ్ ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’ సినిమా షూటింగ్ పూర్తయింది - అక్టోబర్‌లో సినిమాను విడుదల
‘అల్లరి’ నరేశ్ హీరోగా సిరి సినిమా పతాకంపై అమ్మిరాజు కానుమల్లి నిర్మిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’ చిత్రం షూటింగ్ పూర్తయింది. మోనాల్ గజ్జర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో నరేశ్ ట్విన్ సిస్టర్‌గా కార్తీక నటించింది. బి.చిన్ని దర్శకుడు. ఈ సందర్భంగా నిర్మాత అమ్మిరాజు మాట్లాడుతూ ‘ రామోజీ ఫిల్మ్ సిటీలో నరేశ్, మోనాల్‌పై చిత్రీకరించిన పాటతో షూటింగ్ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా నరేశ్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. కామెడీతో పాటు కుటుంబ బాంధవ్యాలకు పెద్ద పీట వేస్తూ దర్శకుడు చిన్ని చక్కగా తెరకెక్కించారు. ఈ నెల్లోనే ఆడియోను, అక్టోబర్‌లో సినిమాను విడుదల చేస్తాం’ అని తెలిపారు. హర్షవర్థన్ రాణే, బ్రహ్మానందం, ఆలీ, జయప్రకాశ్‌రెడ్డి, నాగినీడు, వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, అభిమన్యుసింగ్, కెల్లీ డార్జ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: విక్రమ్‌రాజ్, పాటలు: భాస్కరభట్ల, సంగీతం: శేఖర్‌చంద్ర, ఛాయాగ్రహణం: విజయకుమార్ అడుసుమిల్లి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు.
Source : Andhrajyothi News Paper