loading...

Monday 1 September 2014

లేడీ గబ్బర్‌సింగ్‌ ‘బుల్లెట్‌ రాణి’

0 comments

 లేడీ గబ్బర్‌సింగ్‌ ‘బుల్లెట్‌ రాణి’

                        ‘గబ్బర్‌సింగ్‌’లో పవన్‌కల్యాణ్‌ పోషించిన డేర్‌డెవిల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ కేరక్టర్‌కు మరింత మసాలా దట్టించి, దాన్ని లేడీ కేరక్టర్‌గా మలిస్తే ఎలా ఉంటుందో, ‘బుల్లెట్‌ రాణి’ అలా ఉంటుందని చెప్పారు సురేశ్‌ గోస్వామి. ప్రియాంక కొఠారి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘బుల్లెట్‌ రాణి’కి ఆయన దర్శకుడు. తెలుగు, కన్నడ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రాన్ని ఫోకస్‌ ఆన్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎం.ఎస్‌. యూసఫ్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికి 70 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం గురించి సురేశ్‌ గోస్వామి మాట్లాడుతూ ‘‘సంఘ విద్రోహ శక్తులపై ఓ లేడీ గబ్బర్‌సింగ్‌లా, ఓ సివంగిలా ప్రియాంక విరుచుకుపడే తీరు అందర్నీ అమితంగా అలరిస్తుంది. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌గా తయారవుతున్న ఈ చిత్రాన్ని గ్లామర్‌, యాక్షన్‌, కామెడీ మేళవింపుతో రూపొందిస్తున్నాం. ఈ మాస్‌ మసలా ఎంటర్‌టైనర్‌ ద్వారా తెలుగులో పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. అమిత్‌, జెస్పర్‌, చేతన్‌ కీలక పాత్రధారులైన ఈ చిత్రానికి సంగీతం: గున్వంత్‌, కూర్పు: వి. సురేశ్‌కుమార్‌, కళ: నాగు, ఫైట్స్‌: డ్రాగన్‌ ప్రకాశ్‌, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: సురేశ్‌ గోస్వామి.



Source : - Andhrajyothy News Paper

No comments:

Post a Comment