loading...

Sunday 31 August 2014

‘లౌక్యం’ వచ్చే వారం పాటలు విడుదల, 26న సినమా విడుదల

0 comments
                          
                                  గోపీచంద్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘లౌక్యం’. శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నాయిక. ఈ చిత్రం షూటింగ్‌ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఇటీవల స్విట్జర్లాండ్‌లో మూడు పాటలను చిత్రీకరించాం. దీంతో చిత్రీకరణ పూర్తయింది. వచ్చే వారంలో పాటల్ని విడుదల చేస్తాం. అన్ని పనులను పూర్తి చేసి సెప్టెంబర్‌ 26న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు.  దర్శకుడు మాట్లాడుతూ ‘‘గోపీచంద్‌లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సినిమా ఇది. పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కుతోంది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం క్లాస్‌, మాస్‌ ఆడియన్స్‌కి నచ్చుతుంది’’ అని అన్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీధర్‌ సీపాన, స్ర్కీన్‌ప్లే; కోన వెంకట్‌, గోపీమోహన్‌, కెమెరా: వెట్రి, ఎడిటింగ్‌: శేఖర్‌.


No comments:

Post a Comment