Renu Desai's Ishq Wala Love-Theatrical Trailer - Adinath Kothare, Sulagna Panigrahi
రేణుదేశాయ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న మరాఠీ చిత్రం 'ఇష్క్ వాలా లవ్'. ఈ తరం ప్రేమ కథని చక్కని విజువల్స్ తో రొమాంటిక్ కామెడీ జానర్ లో ఆమె ముచ్చటగా తెరకెక్కించింది. ఈ విషయం ఆమె తాజాగా పవన్ పుట్టిన రోజు సందర్బంగా విడుజల చేసిన టీజర్ తో స్పష్టమవుతోంది. ఈ టీజర్ చూస్తూంటే ఖచ్చితంగా ఆమె హిట్ కొడుతుందనిపిస్తోంది. ఆ టీజర్ మీరూ చూడండి...
'ఇష్క్ వాలా లవ్' చిత్రం కథ,మాటలు స్వయంగా రేణునే అందించి తెరకెక్కించింది. ఈ కథ ఓ జంట కు చెందింది. ఇందులో ఓ సెంటిమెంటల్ కుర్రాడికి, క్రేజీ అమ్మాయికి జరిగే లవ్ స్టోరీ. ఈ పాత్రల వైరుధ్యాలే చిత్రానికి ప్రాణం అని చెప్తున్నారు. అక్టోబర్ 10న ఈ చిత్రం విడుదల అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్బింగ్ చేయనుంది. ఇందులో ఓ స్పెషల్ ఎట్రాక్షన్ ఉంది. అది మరేదో కాదు...
ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌ల కుమారుడు అకిరా నందన్ ముఖానికి రంగేసుకున్నాడు. తన తల్లి రేణుదేశాయ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న మరాఠీ చిత్రం 'ఇష్క్ వాలా లవ్'లో అకిరా అతిథి పాత్రల్లో మెరవబోతున్నాడు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రేణుదేశాయ్ ట్విట్టర్‌లో ద్వారా ప్రకటించారు.
''నేను ముందుగా మాట ఇచ్చినట్లు ఈ రోజు తీపి కబురు చెబుతున్నా. నా కొడుకు అకిరా నందన్ 'ఇష్క్ వాలా లవ్'లో అతిథి పాత్ర పోషిస్తున్నాడు. ఓ తల్లిగా నా కొడుకుని డైరక్ట్ చేయడం ఆనందంగా ఉంది'' అంటూ రాసుకొచ్చారు రేణు దేశాయ్. ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తామని ఇదివరకే రేణు దేశాయ్ చెప్పారు. అంటే అకిరా నటనను తెలుగు తెరపైనా చూసే అవకాశముంది.