రామ్‌గోపాల్‌వర్మ ప్రవేశపెట్టిన ఫ్లోకాం టెక్నాలజీతో - పెసరట్టు మూవీ షూటింగ్ ప్రారంబం
క్లాప్‌బోర్డ్ మీడియా, రామ్‌ప్రియాంక మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్, పింక్ పాక్డి, రవెజ్జ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు కలిసి ‘పెసరట్టు’ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నందు, నికితానారాయణ్ జంటగా నటిస్తున్నారు . కత్తి మహేశ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘పెసరట్టు’ చిత్రం షూటింగ్ గురువారం ఉదయం గండిపేటలోని ఓ గెస్ట్‌హౌస్‌లో మొదలైంది.హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి షాట్‌కు దర్శకుడు స్టీవెన్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించగా తమ్మారెడ్డి భరద్వాజ కెమెరా స్విచాన్ చేశారు. టాలీవుడ్‌లోనే తొలిసారిగా క్రౌడ్ ఫండింగ్ పద్ధతిలో నిర్మాణం జరుపుకుంటున్న చిత్రమిదనీ, రామ్‌గోపాల్‌వర్మ ప్రవేశపెట్టిన ఫ్లోకాం టెక్నాలజీని ప్రేరణగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామనీ నిర్మాతలు చెప్పారు.
హీరోహీరోయిన్లు మినహా మిగిలిన నటీనటులందరినీ సోషల్ మీడియా నెట్‌వర్క్ ద్వారా ఎంపిక చేసుకుని వారందరికీ వారంరోజుల పాటు వర్క్‌షాప్ నిర్వహించి ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలిపారు. సింగిల్ షెడ్యూల్‌లో నిర్మాణం పూర్తి చేసి అక్టోబర్‌లో సినిమాను విడుదల చేస్తామన్నారు.
ఈ చిత్రానికి మాటలు: ఎ.సత్యప్రసాద్, పాటలు: సుభాష్, సంగీతం: ఘంటశాల విశ్వనాథ్, ఫొటోగ్రఫీ: కమలాకర్, లైన్ ప్రొడ్యూసర్: డీకె విశ్వనాథ్, నిర్మాతలు: శ్రీనివాస్ గునినెట్ట, ఈడుపుగంటి శేషగిరిరావు, డీజీ సుకుమార్.