loading...

Wednesday 3 September 2014

Bellamkonda Srinivas, Boyapati film launched

0 comments
                           బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేస్తూ వివి వినాయిక్ అల్లుడు శ్రీను చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే. భారీగా ప్రమోషన్ చేస్తూ ఈ చిత్రం యావరేజ్ నుంచి హిట్ వైపుకి తీసుకుని వెళ్ళారు. ఈ నేపధ్యంలో ఆ కుర్రాడి రెండో సినిమాని ఫైనల్ చేసారని సమాచారం. బాలకృష్ణతో సింహా,లెజండ్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను ని ఈ చిత్రానికి దర్శకుడుగా ఎంపిక చేసుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్. అయితే బోయపాటి శ్రీను చేసే భారీ యాక్షన్ సీక్వెన్స్ లకు ఎంతవరకూ బెల్లంకొండ శ్రీనివాస్ సెట్ అవుతాడో చూడాలి అంటున్నారు. తన సినిమాల్లో విపరీతమైన హింసను ప్రొజక్టు చేసే బోయపాటి, ఈ చిత్రంలో కూడా హీరో చేత తలలు నరికిస్తాడా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే లవ్ స్టోరీ అయ్యండే అవకాసం ఉందని, కాకపోతే తన ట్రేడ్ మార్క్ యాక్షన్ సీన్స్ ని మిస్ కాకుండా చూసుకుంటాడని అంటున్నారు. రెండో సినిమాకే తలలు నరికిస్తాడా?
                       
                        ఈ చిత్రాన్నిసైతం బెల్లంకొండ సురేష్ స్వయంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఈ ప్రాజెక్టు ఉందని, రెండు నెలల్లోగా ఎనౌన్సమెంట్ వస్తుందని అంటున్నారు. అయితే రెండో సినిమాకు సైతం పెద్ద దర్శకుడు కావటంతో ఓపినింగ్స్, ప్రాజెక్టుకు క్రేజ్ వచ్చే అవకాసం ఉంది. ఈ చిత్రంలో అయినా హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ ప్రూవ్ చేసుకోవటానికి ఏమన్నా సీన్స్ పెడితే బాగుంటుంది అంటున్నారు సినిమా జనం.                    
                            హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ...తొలి సినిమా విడుదలైపోయింది.. ఇక వరుసగా చేసేద్దాం అనుకునే రకం కాదు. అందుకే మళ్లీ ఓ రెండు నెలలు అమెరికా వెళ్లి కొత్త డ్యాన్స్‌లు, యుద్ధ విద్యలు నేర్చుకొని వస్తాను. ఈలోగా నాన్న కథ ఓకే చేస్తాను. వెంటనే కొత్త సినిమా ప్రారంభిస్తాం అన్నారు. ప్రస్తుతం పరిశ్రమలో యువ నాయకులు మధ్య పోటీ చాలా ఉంది. ప్రతి సినిమాకు ప్రేక్షకులకు కొత్తదనాన్ని ఇస్తూ ఉంటే ప్రేక్షకుల అలరిస్తూనే ఉంటారు. అందుకే సినిమా చూసి నేను ఇంకా ఏ విషయంలో ఇంకా మెరుగుపడొచ్చు అని చూసుకున్నాను. తర్వాత సినిమాలో అవి లేకుండా చూసుకుంటాను అని చెప్పుకొచ్చారు.
                            అలాగే... మాస్‌ ఇమేజ్‌కు కావాల్సిన అన్ని అంశాలు నాలో ఉన్నాయనేది నా నమ్మకం. నా ఫేస్‌, డ్యాన్స్‌, హైట్‌, ఫైట్స్‌ ఇలా అన్నీ ఇటువైపు వచ్చేలా చేశాయి. అయితే మూస పద్ధతిలోకి వెళ్లిపోకుండా వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటాను. నా తొలి సినిమాకి దర్శకుడిగా వినాయక్‌గారు కావడం నా అదృష్టం. ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. ప్రతి సన్నివేశాన్ని చేసి చూపించి నాతో చేయించారు. నాన్న, వినాయక్‌ అంకుల్‌ కలసి నన్ను రాత్రికి రాత్రే స్టార్‌ను చేసేశారుఅని చెప్పారు.

  






No comments:

Post a Comment