సమంత ఇంత నాటుగా...మాస్ గానా ? (వీడియో)
హైదరాబాద్ :లింగుస్వామి దర్శకత్వంలో సూర్య, సమంత జంటగా నటించిన ‘సికిందర్' రేపు (ఆగస్టు 15న) విడుదల కానుంది. తెలుగు,తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం పబ్లిసిటీ కూడా ఓ రేంజిలో ఉంది. ఈ చిత్రం కు క్రేజ్ రావటానికి ఈ చిత్రంలో సమంత మాస్ స్టెప్స్ వేసిన సాంగ్ తమిళ వెర్షన్ ని విడుదల చేసారు. ఈ ఒక్కపాట చాలు సినిమా హిట్టవటానికి అంటున్నారు ఈ పాట చూసిన వాళ్లు. మీరూ ఓ లుక్కేసి మీ అభిప్రాయం కామెట్స్ రూపంలో చెప్పండి.
సూర్య ఇందులో కృష్ణ, రాజుభాయ్ అని రెండు పాత్రలు చేశారు. ముంబై నేపథ్యంలో కథ జరుగుతుంది. సంతోష్‌శివన్ కెమెరా పనితనం, యువన్ సంగీతం హైలైట్ అవుతాయి. సమంత, విద్యుత్ జమ్వాల్, బ్రహ్మానందంగారు ఇలా మంచి టీమ్ కుదిరింది. సినిమాలో ప్రతి 15-20 నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుంది. సూర్య మాట్లాడుతూ ‘‘లింగుస్వామితో మా తమ్ముడు కార్తి ‘ఆవారా' చేశాడు. ఈ డైరక్టర్‌తో షూటింగ్ చేస్తే మంచి ట్రిప్‌కి వెళ్లొచ్చిన ఫీలింగ్ ఉంటుందని చెప్పాడు. నాక్కూడా అచ్చం అలాగే అనిపించింది. మామూలుగా హీరోల దర్శకులు, నిర్మాతల దర్శకులు ఉంటారు. కానీ, లింగుస్వామి ఆడియన్స్ డైరక్టర్. తన మెమరీ పవర్ అమేజింగ్. ప్రతి సినిమాలోనూ, ప్రతి సన్నివేశంలోనూ ఏదో మేజి క్ చేస్తాడు. రెగ్యులర్ సినిమాను కూడా ఆయన చెప్పే స్టైల్, చూపించే విధానం కొత్తగా ఉంటుంది. అసలు ఎవరూ ఊహించని ఆ ట్విస్ట్‌లు విని నేను బాగా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా విడుదలయ్యాక లగడపాటి శ్రీధర్ ద మోస్ట్ హ్యాపీయస్ట్ ప్రొడ్యూసర్‌గా ఉంటారు'' అని అన్నారు. అలాగే.. ‘‘నేను, లింగుస్వామి సార్ కలిసి 2001లో ఓ సినిమా చేయాలనుకున్నాం. కానీ కుదరలేదు. ఆ తర్వాత ‘పందెం కోడి' స్ర్కిప్ట్ చేయాల్సింది. అప్పుడు నేను ‘నంద', ‘గజిని' సినిమాలతో బిజీ. మరలా మిస్ అయింది. ఇప్పటికి కుదిరింది. వరుస హిట్ సినిమాలు తీస్తున్న దర్శకుడైనా లింగుస్వామి నాకోసం చాలా ఆసక్తిగా స్ర్కిప్టులు సిద్ధం చేశారు. మూడు స్ర్కిప్టులు చెప్తే దీన్ని సెలక్ట్ చేసుకున్నాను. నాకు కలిగిన చిన్న చిన్న అనుమానాలకు కూడా ఆయన దగ్గర మంచి క్లారిటీ ఉంది. నెంబరాఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏ స్ర్కిప్ట్‌కి ఎలా స్ర్కీన్‌ప్లే చేయాలో తెలిసిన వ్యక్తి లింగుస్వామిగారు'' అని అన్నారు సూర్య. విద్యుత్ జమ్వాల్, మనోజ్‌బాజ్‌పాయ్, వివేక్, బ్రహ్మానందం, సూరి తదితరులు నటిస్తున్నారు. యూటీవీ మోషన్ పిక్చర్స్, తిరుపతి బ్రదర్స్ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. యువన్ శంకర్‌రాజా సంగీతం సమకూర్చుతున్నారు.
Source : telugu.oneindia.in