రాజమౌళి చిత్రాలు వరసగా ఇతర భాషల్లోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు బెంగాళి పరిశ్రమ దృష్టి ‘మగధీర' పై పడింది. తెలుగులో భారీస్థాయి విజయాన్ని సాధించిన చిత్రం ‘‘మగధీర''. మగధీర హక్కులను మంచి రేటుకు కొనుగోలు చేసి ‘యోధ'-ది వారియర్ టైటిల్ తో భారీ సెట్స్ తో భారీగా నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్ ఇక్కడ చూడండి... ఇక ఈ చిత్రం తెలుగులో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి కొన్ని విశేషాలు... ‘మగధీర'లోని ఓ సీన్లో చరణ్ డ్రమ్ము వాయిస్తాడు. ఆ డ్రమ్ము నిజంగా తయారు చేశాం. ‘మరీ ఇంత చాదస్తమా?' అని నిర్మాత వారిస్తున్నా.. వినకుండా... నాగ్పూర్ నుంచి ప్రత్యేకంగా పచ్చిచర్మాన్ని తెప్పించాం. ఆ చర్మం దారుణమైన స్మెల్ వస్తున్నా... భరిస్తూ ఆ డ్రమ్ తయారు చేశాం. చరణ్ ఆ డ్రమ్ వాయిస్తున్నప్పుడు దుమ్ము లేస్తుంటే జనాల్లో వచ్చిన వైబ్రేషన్ తెలిసిందే. ఏ విషయంలోనూ రాజీ పడకుండా నిర్మాత సహకరించడం వల్లే అంత అద్భుతాన్ని తెరపై ఆవిష్కరించగలిగాం అంటున్నారు ఆర్ట్ డైరక్టర్ రవీందర్. అలాగే ‘మగధీర'లో జలపాతాన్ని ఛేదించుకుంటూ గుర్రంపై ఎంటరవుతాడు రామ్ చరణ్. అది చాలామంది గ్రాఫిక్స్ అనుకుంటారు. కానీ అది గ్రాఫిక్స్ కాదు. మేం చేసిన మేజిక్. గ్రాఫిక్స్తో ఆ సన్నివేశం తీస్తే జనాలకు తేలిగ్గా అర్థమైపోతుంది. దాంతో ఆసక్తి తగ్గుతుంది. లొకేషన్లో ఆ సీన్ తీసేటప్పుడే అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు అంటూ వివరించారు.
Film : Yoddha
Starring : Dev,Mimi Chakraborty,Nigel,Rajatava Dutta and others.
Producer : Shree Venkatesh Films.
Presenter : Shrikant Mohta & Mahendra Soni
Direction : Raj Chakraborty.