పవన్ కళ్యాణ్ రికార్డ్ బాలయ్య బ్రేక్ చేస్తాడా?
బాలకృష్ణకు సరైన కథ పడితే ఆ హిట్ రేంజిని పట్టుకోవటం కష్టం అంటారు. ఎందుకంటే ఆయన అభిమానులు ఆయన సినిమాలను ఆ రేంజిలో ఆదరిస్తూంటారు. ఈ మధ్యకాలంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన లెజెంబ్ సినిమా మార్చి 28 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై యావత్ సినీ అభిమానుల్ని ఆకట్టుకుని ఘన విజయం సాధించి ప్రూవ్ చేసింది. తొలి వారంలోనే 33 కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించి రికార్డ్ ను సృష్టించింది. ఈ సినిమా 50 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం ఖాయం అన్న సినిమా విశ్లేషకుల అంచానాలను నిజం చేస్తూ 50 కోట్ల పై చిలుకు వసూళ్ళు సాధించిన లెజెండ్ చిత్రం 2014వ సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఊపిరి పోసింది.
ఇప్పుడు ఈ చిత్రం జెమినీ ఛానెల్ లో ఆగస్టు 16 న టెలికాస్ట్ అవుతోంది. ఈ చిత్రం అక్కడా రికార్డు క్రియేట్ చేసే అవకాసం ఉందని అంచనాలు వేస్తున్నారు. టీఆర్పీలు అదరకొట్టగల చిత్రమని టీవీ ఛానెల్ ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. అత్తారింటికి దారేది చిత్రం ఈ మధ్య కాలంలో ఎక్కువ టీఆర్పీని నమేదు చూసింది. దాన్ని బ్రేక్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. నందమూరి బాలకృష్ణ అభినయం, ఆయన పలికిన సంభాషణల తీరు,భోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ, వారాహి చలన చిత్రం మరియు 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ప్ నిర్మాణ విలువలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రం సాధిస్తున్న సంగీతం ఈ చిత్రం సాధిస్తున్న సంచలన విజయంలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా బోయపాటి శ్రీను తన 5వ చిత్రంతోనే 50 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకోవడం విశేషం. 2014లో సరైన హిట్టు ఒక్కటీ లేదే అనుకుంటున్న తరుణంలో సరిగ్గా బోయపాటి 'లెజెండ్'ని రంగంలోకి దించాడు. ఈ ఏడాదిలోనే బ్లాక్‌బస్టర్ హిట్‌ని పరిశ్రమకు ఇచ్చాడు. అటు ప్రేక్షకుల్ని కేరింతలు కొట్టించాడు. ఈ క్రెడిట్ పూర్తిగా నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనులదే. బాలయ్యలో అసలైన సింహాన్ని తెరపైకి తెచ్చాడు. యాక్షన్‌లో ఉగ్రనరసింహుడిని చూపించాడని ఫ్యాన్స్ అంటున్నారు. లెజెండ్ గర్జనతో థియోటర్స్ మార్మోగిపోయాయి. కుటుంబ ప్రేక్షకుల కోసం చక్కని సెంటిమెంట్ రంగరించి వదలటం ప్లస్ అయ్యింది. ముఖ్యంగా సెకండాఫ్ లో సెంటిమెంట్, ట్రెయిన్ ట్రాక్‌పై ఎపిసోడ్‌లో ప్రేమ సన్నివేశం ప్రేక్షకుడి గుండె పగిలిపోయే ఉద్వేగాన్ని ఇచ్చాయి. గుడిమెట్లపై బాలయ్య ఉగ్రరూపం యాక్షన్‌కే కొత్త హంగులు అద్దిందని అంతటా వినపడుతోంది. మాస్ యాక్షన్ ప్రియులకు ఇదో కన్నుల పండుగగా మారింది.