loading...

Sunday 17 August 2014

వరుణ్ తేజ చిత్రం టైటిల్ ఖరారు (అఫీషియల్) - One India Telugu

0 comments

వరుణ్ తేజ చిత్రం టైటిల్ ఖరారు (అఫీషియల్)
అన్ని వెబ్‌సైట్లు ఎందుకు వెతకాలి? ఒకే గొడుగు కింద అన్నీ... హైదరాబాద్ : నాగ బాబు కుమారుడు వరుణ్ తేజ లాంచింగ్ చిత్రం టైటిల్ ఖారారు అయ్యింది. ఈ చిత్రానికి మొదటినుంచీ గొల్లభామ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ టైటిల్ కాకుండా... ముకుందా ని ఫైనల్ చేసారు. ఈ విషయాన్ని హీరో స్వయంగా ట్విట్టర్ లో తెలియచేసారు. వరుణ్ తేజ ట్వీట్ చేస్తూ...: " ప్రతీ ఒక్కరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు...ఈ ప్రత్యేకమైన రోజున నేను నా తొలి చిత్రం టైటిల్ ఎనౌన్స్ చేస్తున్నాను...ఆ టైటిల్ ...ముకుందా" అన్నారు. ముకుందా మురారి, ముకుందా అనే రెండు టైటిల్స్ పరిశీలించి, అందరూ...ముకుందా అనే టైటిల్ కి ఓటు వేయటంతో ఫైనల్ చేసారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం దసరాకి విడుదల చేయాలని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మరో ప్రక్కన చేసేస్తున్నారు. అయితే రామ్ చరణ్ తాజా చిత్రం గోవిందుడు అందరి వాడేలా చిత్రం ని దసరాకు టార్గెట్ చేయటంతో ... నాగబాబు కొడుకు సినిమాని వాయిదా వేసినట్లు సమాచారం. ఈ నెలఖరుకు చిత్రం టాకీ పార్ట్ పూర్తవుతుందని సమాచారం. వరుణ్‌తేజ్‌ హీరోగా పరిచయమవుతున్న సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. శ్రీకాంత్‌అడ్డాల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఠాగూర్‌ మధు సమర్పిస్తున్నారు. లియో ప్రొడక్షన్స్‌ తెరకెక్కిస్తోంది. నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. మిక్కీ.జె.మేయర్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సమర్పకుడు ఠాగూర్‌ మధు మాట్లాడుతూ ‘‘ఇటీవల గోదావరి జిల్లాల్లోని అందమైన లొకేషన్లలో 35రోజులు భారీ షెడ్యూల్‌ చేశాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు జరిగే చిత్రీకరణతో మూడు పాటలు మినహా మొత్తం పూర్తవుతుంది. '' అని అన్నారు. ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, రావు రమేష్‌, నాజర్‌ ఇందులో కీలక పాత్రధారులు. 


No comments:

Post a Comment